తక్షణ శక్తినిచ్చే లవంగ తులసి

ఆహారపానీయాలలోనూ, ఔషధంగానూ ఈ మొక్కను ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలో ప్రతీ భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి సుగంధ పరిమళభరితమైన వాసన వస్తుంటుంది. దీనికి కారణం యూజెనాల్‌, మిథైల్‌ యూజెనాల్‌, కారియోఫిల్లీన్‌, సిట్రాల్‌, కేంఫర్‌, థైమాల్‌ వంటి ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ ఉండటమే. ఇలాంటి అరోమాటిక్‌ తైలాల మిశ్రమాలు యాంటిసెప్టిక్‌గా పనిచేస్తాయి. లవంగ తులసి మొక్కలు ఎక్కువగా పెంచితే ఆ పరిసరాలు పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉంటాయి. దోమలను పారదోలుతాయి.
ప్రయోజనాలు:
- లవంగ తులసి ఆకులను కషాయంగా చేసుకుని తాగితే దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- జీర్ణశక్తిని కలిగించుటకు, శరీరానికి సత్తువ చేకూర్చుటకు ఉపయోగపడుతుంది.
- కీళ్ల సమస్యలను, రక్తస్రావాలను నిరోధించుటకు ఉపకరిస్తుంది.
- తలనొప్పి, పంటి నొప్పి, చెవిపోటు బాధలకు నివారిణిగా పనిచేస్తుంది.
- చిన్న పిల్లల ఉదర సమస్యలకు దివ్యౌషధం. తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు కావు.
- దీని విత్తన ఔషధం విరేచనాలు, నరాల బలహీనతలు, మూత్ర సమస్యలు, చంటి పిల్లల్లో వాంతుల నివారణకు పనిచేస్తుంది.
- ఆకుల రసం వీర్యవృద్ధికి, ఎర్రరక్తకణాల పెంపుకు తోడ్పడుతుంది.
- కాలేయ వ్యాధుల నివారణకు, కాలేయ పనితనాన్ని మెరుగుపరుచుటకు ఉపయోగపడుతుంది.
- దోమలను వికర్షించు శక్తి అధికంగా ఉండటం వల్ల రకరకాల ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా వాడుతున్నారు.
- షుగర్‌ వ్యాధికి తీసుకును ఔషధాల పనితనాన్ని మెరుగుపరచడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది.
* డా.ఎస్‌.వి. రామారావు
ప్లాంట్‌ సైంటిస్ట్‌
ప్రగతి హెర్బల్‌ గార్డెన్స్‌

ఎగ్ సలాడ్ రిసిపి




ఎగ్ సలాడ్ రిసిపి చాలా రుచికరమైనది మరియు హెల్తీ కూడా . వ్యాయామం చేయడానికి ముందు ఇటువంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తక్షణ ఎనర్జీని అందిస్తుంది. వ్యాయామం చేయడానికి అవసరం అయ్యే విటమిన్స్ న్యూట్రీషియన్స్, క్యాల్షియం, ప్రోటీన్స్ ఇలాంటి ఫుడ్ కాంబినేషన్ లో పుష్కలంగా మన శరీరానికి అందుతాయి.

ఆకుకూరలు, గుడ్డు, మరియు టమోటో మూడింటి కాంబినేషన్ తో తయారుచేసిన సలాడ్, వ్యాయామానికి ముందు తీసుకోవడం వల్ల మీ శరీరానికి తగినంత ఎనర్జీ అందించి శరీరానికి వెచ్చదనం అందిస్తుంది. మరి ఈ హెల్తీ సలాడ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...!

కావల్సిన పదార్థాలు:
ఆకుకూర తరుగు: 1cup
గుడ్లు: 2
టమోటో: 2 మీడియం

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి, నీరు మొత్తం ఒడిగిపోయే వరకూ అలాగే పక్కన పెట్టాలి.
2. ఇప్పుడు గ్రిల్ ఆన్ చేసి, వేడయ్యే వరకూ అలాగే ఉంచాలి.
3. తర్వాత నీటిలో గుడ్లను వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు టమోటోలను స్లైస్ గా కట్ చేసి గ్రిల్లో పెట్టాలి.
5. టమోటోస్లైస్ తో పాటు గుడ్లు కూడా ఉడికేంతలోపు, ఆకుకూరను గ్రిల్ ప్లేట్ లో సర్ధుకోవాలి.
6. గుడ్లు పూర్తిగా ఉడికిన తర్వాత, పొట్టు తొలగించి నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
7. ఆకుకూరను సర్దిన ప్లేట్ లో గ్రిల్లో ఉడికించిన టమోటో స్లైస్, కట్ చేసిన గుడ్డును పెట్టాలి. అంతే ఎగ్ సలాడ్ రిసిపి రెడీ. మీరు ఈరుచికరమైన ఎగ్ సలాడ్ తినడానికి ముందు, ఒక గ్లాసులు నీళ్ళు ఖచ్చితంగా త్రాగాలి. అవసరం అయితే పెప్పర్, సాల్ట్ ను కూడా చిలకరించుకోవచ్చు.

ఆరోగ్యప్రదాయిని దానిమ్మ



పరిచయం అవసరంలేని పళ్లలో ఒకటి దానిమ్మ. కవుల వర్ణనలలో చోటుచేసుకునేవి దానిమ్మ గింజలు, దానిమ్మ మొగ్గ. ప్రత్యేకమైన విందులలో దానిమ్మరసం ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఆరోగ్యవంతులూ, అనారోగ్యవంతులూ కూడా నిస్సంకోచంగా సేవించగలిగినదీ, సేవించదగినది. దానిమ్మకి ఆరోగ్యసంరక్షణలో, అనారోగ్య చికిత్సలలో కూడా స్థానం ఉంది.

వృక్షశాస్త్ర పరిభాషలో : Punica granatum

సంస్కృతంలో : దాడిమ
దానిమ్మ అన్ని కాలాల్లోనూ దొరికేపండు. రుచితో పాటు అన్ని ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు దానిమ్మలో అనేకం ఉన్నాయి. కేవలం ఆహారంగా తీసు కోవడానికే కాకుండా దాని గిం జల నుంచి తీసిన రసాన్ని జ్యూస్‌ గా కూడా తాగుతారు. దానిమ్మలోని అన్ని భాగాలు కూడా ఉపయోగపడేవే కావడం విశేషం. దీనిలో ఎన్నో రకాల ఖనిజ లవణాలతో పాటు ఔషధగుణాలు కూడా ఉండడం మూలంగా దీన్ని ఆరోగ్య ప్రదాయిని అనడంలో సందేహం లేదు.

ఏ భాగం వాడాలి?
వేరు, బెరడు, ఆకులూ, పువ్వులూ, పండు మీద ఉండే తొక్క, గింజలూ, రసం అన్నింటిలోనూ ఔషధగుణాలు ఉన్నాయి.

ప్రత్యేక గుణాలు :
ప్రధానంగా జీర్ణమండలానికి సంబంధించిన అనేక సమస్యలలో ఔషధంగా వాడతారు. ఇది గుండెకీ, కాలేయానికీ, మూత్రపిండాలకీ కూడా మంచి టానిక్‌. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మరసంలో శరీరానికి అవసరమైన ఖనిజలవణాలన్నీ లభ్యమవుతున్నాయి.

ప్రయోగాలూ - ప్రయోజనాలూ :
మాంసాహారం తినే వారిలో టేప్‌ వార్మ్‌ అనే పురుగు ఉండే అవకాశం ఉంది. ఈ పురుగు లేదా దాని గుడ్లు కడుపులో లేదా శరీరంలోని రకరకాల భాగాలలో ప్రవేశించి అనేక అనారోగ్యాలకి కారణం అవుతాయి. కడుపులో ఉన్న టేప్‌వర్మ్‌ని బయటికి తీసుకురావడానికి దానిమ్మ మంచి మందు. దానిమ్మ వేర్లు లేదా చెట్టు బెర ుకి సుమారుగా నాలుగు రెట్లు నీరుచేర్చి, బాగాదంచి, రసం తీయాలి. ఈ విధంగా గంటకి ఒకసారి చొప్పు న మూడుసార్లు తీసుకోవాలి. మూడుసార్లూ అయిన తర్వాత విరేచనాలు కావడానికి ఆముదం లేదా ఇతర ఔషధాలు తీసుకోవాలి. అప్పుడు విరేచనం ద్వారా టేప్‌ వర్మ్‌లు బయటికి వస్తాయి. వికారం, ఆకలి లేకపోవడం, కడుపులో మంట, ఇటువంటి సమస్యలు ఉన్నవారు 10-15 మిల్లిలీటర్ల దానిమ్మరసంలో సమానంగా తేనె కలుపు కొని రోజుకి రెండు మూడుసార్ల చొప్పున వాడాలి. దీనివలన తక్షణ ఉపశమనం కలుగుతుంది. కొంతకాలం క్రమం తప్పకుండా వాడితే కడుపులో మంట పూర్తిగా తగ్గి పోతుంది.

నీళ్ల విరేచనాలూ, లేదా జిగట విరేచనాలూ అవుతుంటే 50మి.లీ. దానిమ్మ రసాన్ని మాటిమాటికీ ఇస్తూంటే విరేచనాలు తగ్గుతాయి. డిహైడ్రేషన్‌ సమస్య రాకుండా రక్షణ కూడా కలుగుతుంది. దానిమ్మరసం జ్వరం తగ్గడానికి, జ్వరం వచ్చిన సందర్భంలో నోరు తడి ఆరిపోకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఆసనం దగ్గర దురదగా ఉంటే ...
దానిమ్మపండు తొక్కని పెళుసుగా అయ్యే వరకూ వేయించి (నూనెలో కాదు వట్టిగానే), పొడి చేసి, కొద్దిగా నువ్వుల నూనెలో కలిపి, ఆసనం దగ్గర రాస్తూంటే తగ్గుతుంది.
మూత్రపిండాలలో లేదా మూత్రాశయంలో చిన్న చిన్న రాళ్లు ఉన్న వారు దానిమ్మ గింజలని ముద్దగా నూరి, ఒక చెంచాముద్దని ఒక కప్పు ఉలవచారులో కలిపి, ప్రతిరోజూ తాగుతూంటే నెమ్మదిగా ఆ రాళ్లు మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి.

చిగుళ్లు గట్టిపడడానికి, చిగుళ్ల నుండి రక్తం కారకుండా ఉండడానికీ, దంతాల ఆరోగ్యానికీ, దానిమ్మపండు తొక్క ఎంతగానో ఉపకరిస్తుంది. తొక్కని ఎండబెట్టి, మిరియాలూ, ఉప్పూ చేర్చి మూడిం టినీ మెత్తటి చూర్ణంగా చేసి, దానిని దంతధావనానికి వాడితే దంత సమస్యలు పరిష్కారమవు తాయి.

ఔషధాలు :
దానిమ్మను పలు ఔషధాలలోనూ వాడుతారు. దానిమ్మ పండ్ల తొక్కలని ప్రధానంగా వాడే ఔషధాలలో ప్రధానమైనవి దాడి మాష్టకచూర్ణం, భాస్కర లవణం.  దాడిమాది పానకంలో కూడా దానిమ్మరసాన్ని వాడతారు.

- డాక్టర్‌ గాయత్రీ దేవి
ఆయుర్వేద వైద్య నిపుణులు
ఆరోగ్య పీఠం, మోతీనగర్‌, హైదరాబాద్‌,

రక్తపోటు నియంత్రణకు బీట్‌రూట్‌..!


 అన్నీ శక్తికోసమే కాదు కొన్ని ఆహార పదార్థాలు శక్తినివ్వటమే కాకుండా ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. ప్రకృతి సహజమైన ఆహార పదార్థాల్లోంచే మన ఎన్నో రుగ్మతల్ని నయంచేసే ఔషధాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. కానీ, ఆ విలువల గురించి మనకు తెలియాలి కదా! ఆ తెలియాలంటే వాటి మీద పరిశోధనలు జరగాలి. హైపర్‌ టెన్షన్‌ అనే పత్రిక జరిపిన అధ్యయనంలో నైట్రేట్‌ సమృద్దిగా ఉండే కూరగాయల్లోని నైట్రేట్‌లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. దీనికి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్దిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.

ఏఏ పండ్లలో ఎంతెంత పోషకాలు....!



మన దేశంలో చాలా పండ్లు సీజనల్‍గా లభిస్తుంటాయి. అయితే కొన్ని పండ్లు మాత్రం ఏ కాలంలోనైనా దొరుకుతాయి. చాలా మంది పండ్ల రసం అంటే వేసవి కాలానికే పరిమితమవుతుంటారు. అలా కాకుండా ఏ కాలంలో దొరికే ఆ పండ్లను తినడం వల్ల శరీరానికి కావలసినంత పోషక విలువలు లభిస్తాయి.

అసలు ఏ పండులో ఏఏ పోషకాలు ఎంతెంత శాతంలో ఉంటాయో తెలుసుకుందాం.....!

యాప్రికాట్; విటమిన్ ఎ 0.2 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.06 ఎంజి, విటమిన్ బి2 0.05 ఎంజి, విటమిన్ బి6 0.06 ఎంజి, విటమిన్ సి 5000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.004 ఎంజి.

యాపిల్; విటమిన్ ఎ 0.005 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.02 ఎంజి, విటమిన్ బి2 0.01 ఎంజి, విటమిన్ బి6 0.05 ఎంజి, విటమిన్ సి 5.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.003 ఎంజి.

అరటిపండు; విటమిన్ ఎ 0.015 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.08 ఎంజి, విటమిన్ బి2 0.03 ఎంజి, విటమిన్ బి6 0.36 ఎంజి, విటమిన్ సి 10.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.016 ఎంజి.

బ్లాక్ బెర్రీస్; విటమిన్ ఎ 0.015 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.08 ఎంజి, విటమిన్ బి2 0.04 ఎంజి, విటమిన్ బి6 0.07 ఎంజి, విటమిన్ సి 150.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.008 ఎంజి.

చెర్రీస్; విటమిన్ ఎ 0.12 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.02 ఎంజి, విటమిన్ బి2 0.02 ఎంజి, విటమిన్ బి6 0.04 ఎంజి, విటమిన్ సి 10.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.004 ఎంజి.

ద్రాక్ష; విటమిన్ ఎ 0.005 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.03 ఎంజి, విటమిన్ బి2 0.01 ఎంజి, విటమిన్ బి6 0.08 ఎంజి, విటమిన్ సి 3.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.001 ఎంజి.

కివి; విటమిన్ ఎ 0.01 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.01 ఎంజి, విటమిన్ బి2 0.02 ఎంజి, విటమిన్ బి6 0.12 ఎంజి, విటమిన్ సి 70.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.023 ఎంజి.

నిమ్మ; విటమిన్ ఎ 0.001 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.06 ఎంజి, విటమిన్ బి2 0.02 ఎంజి, విటమిన్ బి6 0.04 ఎంజి, విటమిన్ సి 40.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.008 ఎంజి.

మామిడి; విటమిన్ ఎ 0.53 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.03 ఎంజి, విటమిన్ బి2 0.04 ఎంజి, విటమిన్ బి6 0.04 ఎంజి, విటమిన్ సి 23.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.023 ఎంజి.

ఆరెంజ్; విటమిన్ ఎ 0.012 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.07 ఎంజి, విటమిన్ బి2 0.03 ఎంజి, విటమిన్ బి6 0.06 ఎంజి, విటమిన్ సి 49.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.018 ఎంజి.

పైనాపిల్; విటమిన్ ఎ 0 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.07 ఎంజి, విటమిన్ బి2 0.02 ఎంజి, విటమిన్ బి6 0.09 ఎంజి, విటమిన్ సి 25.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.004 ఎంజి.

స్ట్రాబెర్రి; విటమిన్ ఎ 0.002 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.02 ఎంజి, విటమిన్ బి2 0.03 ఎంజి, విటమిన్ బి6 0.06 ఎంజి, విటమిన్ సి 60.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.065 ఎంజి.

టొమాటో; విటమిన్ ఎ 0.088 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.05 ఎంజి, విటమిన్ బి2 0.02 ఎంజి, విటమిన్ బి6 0.08 ఎంజి, విటమిన్ సి 15.000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.008 ఎంజి.

పుచ్చకాయ; విటమిన్ ఎ 0.045 మిల్లీగ్రామ్, విటమిన్ బి1 0.04 ఎంజి, విటమిన్ బి2 0.05 ఎంజి, విటమిన్ బి6 0.07 ఎంజి, విటమిన్ సి 6000ఎంజి, ఫోలిక్ యాసిడ్ 0.001 ఎంజి.

అల్పాహారం ఎంత అయితే అంత ఆరోగ్యం.!



 అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది

శీఘ్రస్ఖలనం ఇక సమస్యే కాదు....!



పురుషుడి జీవితాన్ని అమితంగా కుదిపేసే అతి పెద్ద భయాల్లో శీఘ్రస్ఖలనం ఒకటి. పురుషుల్లో అత్యధికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కూడా ఇదే. అల్లోపతి వైద్యం శీఘ్రస్ఖలన సమస్యకు మూలం మెదడులోనే ఉందని, మానసిక ఒత్తిళ్లే అతి పెద్ద కారణమని అదేపనిగా చెబుతూ ఉంటుంది. కాని, అది నిజం కాదు. శీఘ్రస్ఖలన సమస్య కారణాల్లో మెదడు కూడా ఒక భాగమే. దానికి మించి హార్మోన్ సమస్యలు అతి పెద్ద కారణంగా ఉంటాయి. వాటితో పాటు కండరాలు, నరాలు, రక్తనాళాలు వీటన్నింటి భూమిక కీలకంగానే ఉంటుంది. వీటన్నింటితో పాటు ఇటీవల జరిపిన పరిశోధనల్లో శీఘ్రస్ఖలన సమస్యకు నాడీవ్యవస్థలో అంతటా ఉండే సెరటొనిన్ పరిమాణం తగ్గడం ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ వాస్తవాల్ని విస్మరించి చాలామంది శీఘ్రస్ఖలన సమస్యకు మానసిక ఒత్తిళ్లే కారణమని చెబుతూ వస్తున్నారు.

ఆయుర్వేదం.. ఓ అద్భుతం...!
అల్లోపతిలో శీఘ్రస్ఖలనం అన్నది ఎప్పటికీ తొలగిపోని శాశ్వత వ్యాధి. ఆయుర్వేదంలో అది సంపూర్ణంగా తొలగిపోయే సమస్య. మౌలికంగా శీఘ్రస్ఖలనం అన్నది వాత వికతి వల్ల తలెత్తే సమస్య. ఒకసారి వాతం ప్రకోపిస్తే అది పిత్తాన్ని, కఫాన్ని పెంచేస్తుంది. పిత్తం పెరిగితే లైంగిక వ్యవస్థ బలహీనపడుతుంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అంగస్తంభనలు తగ్గిపోతాయి. అందువల్ల లైంగిక శక్తి బలంగా ఉండాలంటే వాత, పిత్త, ఫాలు మూడూ సమతులంగా ఉండాలి. ఆ లక్ష్యంగానే ఆయుర్వేదం పనిచేస్తుంది. ఆయుర్వేదం శీఘ్రస్ఖలనాన్ని అరికట్టగల శక్తినిస్తుంది. శంగారంలో లోతైన ఆనందానికి పాత్రుల్ని చేస్తుంది. ఆయుర్వేదంలో అష్టాంగాలు అంటూ ఒక ఎనిమిది విభాగాలున్నాయి. వాటిలో లైంగిక విషయాలకే ప్రత్యేకించి వాజీకరణ తంత్రం ఉంది. ఇది సమస్త లైంగిక సమస్యలకు నివారణా మార్గాలను సూచించడంతో పాటు సంతానలేమి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.

శాశ్వత పరిష్కారంగా......!
శీఘ్రస్ఖలన సమస్య నివారణకు ఆయుర్వేదంలో వాతహర చికిత్సలు చేస్తారు. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకునే వైద్యం చేస్తారు. ఆపైన వాజీకరణ చికిత్సలు చేస్తారు. ఇందులో వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది. వీటితో పాటు లైంగిక పటిమను పెంచేవి, మానసిక సమస్యలను తొలగించేవి, శుక్రాన్ని శక్తివంతం చేసేవి ఇలా పలు రకాల ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకున్నప్పుడు సప్తధాతువులూ వద్ధిచెందుతాయి. వైద్య చికిత్సలతో శుక్రంలో పుష్టి ఏర్పడితే శంగారంలో పరిపూర్ణ ఆనందాన్ని పొందే స్థితి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కూడా కలుగుతుంది. ఆయుర్వేద చికిత్సలతో సప్తధాతువుల్లోని చివరిదైన శుక్రం పరిపుష్టం కావడమే కాకుందా, ప్రాణవంతమైన ఓజస్సు కూడా వద్ధి చెందుతుంది. అయితే వాజీకరణాలు గాని, రసాయనాలు గాని తీసుకునే ముందు శరీరంలోని అమాన్ని అంటే వ్యర్థ, విషపదార్థాలను సంపూర్ణంగా తొలగించుకోవాలి. అందుకు పంచకర్మ చికిత్సలు చేయించుకోవాలి. వీటిన్నింటి ద్వారా మొత్తంగా సర్వశక్తివంతంగా మారి, అవి తమ సహజశైలిలో పనిచేయడం మొదలెడతాయి. ఫలితంగా శీఘ్రస్ఖలన సమస్యకు ఇక ఎంతమాత్రం తావుండదు.

- డాక్టర్ వర్ధన్
ది కేరళ ఆయుర్వేదిక్ కేర్, స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్, హైదరాబాద్,

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review