అన్నీ శక్తికోసమే కాదు కొన్ని ఆహార పదార్థాలు శక్తినివ్వటమే కాకుండా
ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. ప్రకృతి సహజమైన ఆహార పదార్థాల్లోంచే మన ఎన్నో
రుగ్మతల్ని నయంచేసే ఔషధాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. కానీ, ఆ విలువల గురించి
మనకు తెలియాలి కదా! ఆ తెలియాలంటే వాటి మీద పరిశోధనలు జరగాలి. హైపర్
టెన్షన్ అనే పత్రిక జరిపిన అధ్యయనంలో నైట్రేట్ సమృద్దిగా ఉండే
కూరగాయల్లోని నైట్రేట్‌లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే
అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్‌ను నైట్రిట్
అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. దీనికి
రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉంది. అధిక రక్తపోటు
ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్ రసాన్ని ఇచ్చి
24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు
గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. పైగా ఆ రసం ప్రభావంతో అధిక
రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య
ఉన్నవారు నైట్రేట్ సమృద్దిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం
ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.



Posted in: