ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ల వాపు రావడం
సాధారణమే. కానీ కొన్నిసార్లు వచ్చే కాళ్లవాపును ఏ మాత్రం నిర్లక్ష్యం
చేయకూడదు. కాళ్లవాపుతో పాటు నల్లని మచ్చలు కనిపించడం, ఎర్రగా మారితే ఇంకా
ప్రమాదం. ఒక్కోసారి ఆ వాపు తీవ్రమై, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. కాళ్లవాపు, కారణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేదే ఈ కథనం.
కాళ్ల వాపు సాధారణమే. కానీ కాళ్లు సడెన్‌గా వాపు రావడంతో పాటు ఎర్రగా మారడం జరిగితే ప్రమాదమని గుర్తించాలి. ఉదయాన లేచినపుడు కాళ్ల వాపు ఉండదు, నొప్పి ఉండదు. కానీ మధ్యాహ్నానికల్లా కాళ్ల వాపు మొదలవుతుంది. కొన్నిసార్లు వాపుతో పాటు కాళ్లపై నల్లమచ్చలు కనిపిస్తాయి. చాలామంది నల్లమచ్చలతో కాళ్లవాపు కనిపించినపుడు చర్మవైద్యులను సంప్రదిస్తుంటారు. కాళ్లలో వచ్చిన అల్సర్‌ను స్కిన్‌ఎగ్జిమాగా పొరబడి స్కిన్ స్పెషలిస్టుల దగ్గరకు వెళతారు. ఎంతకీ తగ్గకపోవడంతో మరికొంత మంది స్పెషలిస్టులను సంప్రదిస్తారు. ఈ లోగా సమస్య మరింత తీవ్రమవుతుంది. వ్యాధి బాగా ముదిరిపోతుంది.
వాపు ఎందుకు?
మనదేశంలో చాలా మంది రోటీన్ లైఫ్‌స్టయిల్‌కు అలవాటుపడిపోయారు. కంప్యూటర్‌ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తారు. గృహిణిలు టీవీ ముందు కూర్చుని గంటల తరబడి సీరియల్స్ చూస్తుంటారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుండిపోతారు. పిల్లలు, యువతీయువకులు ఫిజికల్ గేమ్స్‌కు దూరంగా ఉండిపోతున్నారు. నిజానికి కంప్యూటర్లు, టీవీలు మనందరికీ శత్రువులుగా మారుతున్నాయి. కాల్‌సెంటర్లు, బీపీఓ ఉద్యోగాలు చేసే వారిలో ఈ కాళ్ల వాపు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ సమయం, గంటల తరబడి కూర్చోవడం వల్ల కాళ్లలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలో అవాంతరం తలెత్తుతుంది. మస్కులార్ పంప్ పనితీరు తగ్గిపోతుంది. ఇది కాళ్లకు రెండు రకాలుగా హాని చేస్తుంది. మొదట రక ్తంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. పెద్ద మొత్తంలో మలినాలు పేరుకుపోతాయి. దీనివల్ల అసౌకర్యంగా ఉండటం, దురద, కాళ్లలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండవది రక్తంలో గడ్డకట్టడం వల్ల, మలినాలతో కూడిన రక్తం కాళ్లలో పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి మొదలవుతుంది.
రెగ్యులర్‌గా నడవకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల కాళ్లలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతుంటాయి. ఈ పరిస్థితిని మెడికల్ టర్మ్స్‌లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఒకవేళ ఈ కండీషన్‌కు సరియైున సమయంలో చికిత్స తీసుకోకపోతే పల్మనరీ ఎంబాలిజమ్‌కు దారితీసి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అంటే కాళ్లలో ఏర్పడిన బ్లడ్ క్లాట్స్ అక్కడి నుంచి కదిలి రక్తనాళం గుండా ప్రయాణించి గుండె ద్వారా ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉంది. ఒకవేళ సరియైున సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. నొప్పి, కాలు వాపు ఉన్నట్లయితే వాస్క్యులర్ సర్జన్‌ను కలవడం ద్వారా ఈ పరిస్థితి రాకుండా కాపాడుకోవచ్చు.
రక్తనాళాలు ఉబ్బిపోతే...
ఉదయాన్న కాసేపు నడవడం అలవాటు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కాళ్లలో డ్రెనేజ్ వ్యవస్థలో అవాంతరాలు ఏర్పడతాయి. కాళ్లలో ఉండే కవాటాలు పనిచేయడం మానేస్తాయి. దీంతో రక్తం పైకి ప్రవహించలేకపోతుంది. కాలి కింది భాగంలో చెడు రక్తం పేరుకుపోతుంది. ఒకదశ దాటిన తరువాత రక్తనాళాలు(సిరలు) ఉబ్బిపోతాయి. బయటకు ఉబ్బి వానపాముల మాదిరిగా, నీలిరంగులో స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యను వెరికోస్ వెయిస్స్ అంటారు. ఒకవేళ జీవనవిధానంలో మార్పులు చేసుకోకుండా, సరియైున చికిత్స తీసుకోకుండా వదిలేస్తే సిరలు బాగా ఉబ్బిపోయి కాలిలో రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
నల్లమచ్చలతో ఉంటే..
కొందరిలో కాలు వాపుతో పాటు గుండ్రని నల్లటి మచ్చలు కనిపిస్తాయి. కాలు వాపు ఎప్పుడూ ఉంటుంది. ఉదయం వేళ కాలు వాపు కొద్దిగా తగ్గినట్టే కనిపించినా, సూర్యాస్తమయం తరువాత మళ్లీ మొదలవుతుంది. సాధారణగా ఈ సమస్య మధ్య వయసు సీ్త్రలలో కనిపిస్తుంది. అధిక బరువు ఉండి, ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారిలోనూ కనిపిస్తుది. ఈ సమస్యను క్రానిక్ వీనస్ ఇన్‌సఫిసియెన్సీ అంటారు. ఒకవేళ నల్లని మచ్చలు కాలు కింది భాగంలో కనిపిస్తే కనుక వాస్క్యులర్ సర్జన్‌ను సంప్రదించాలి.
ఇతర కారణాలు కావచ్చు
కాలు వాపుకు రక్తనాళాల సమస్యలే కాకుండా ఇతర వ్యాధులు కూడా కారణం కావచ్చు. లింఫడిమా, ఎలిఫెంటియాసిస్, కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు నియంత్రణ కోసం వాడే అమ్లోడిపిన్ వంటి మందులు కారణం అవుతాయి.
నిర్లక్ష్యం చేస్తే...
ఒకవేళ కాలు వాపుకు తగిన చికిత్స తీసుకోనట్లయితే రెండు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. రక్తనాళాలు తీవ్రంగా ఉబ్బిపోతాయి. రక్తస్రావం జరగవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. రెండవది కాలి కింది భాగంలో దురద, నొప్పి ఉంటుంది. తీవ్రమైన దురద మొదలవుతుంది. గోకిన చోట పసుపు రంగులో ఫ్లూయిడ్ కారుతుంది. ఈ ఫ్లూయిడ్ చర్మంపై ఇరిటేషన్ కలిగించి ఎగ్జిమాకు దారితీస్తుంది. చివరగా ఎంతకూ తగ్గని అల్సర్‌గా మారుతుంది.
చికిత్స ఎలా ఉంటుంది?
కాలి రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఉన్నట్లయితే తొలగించాలి. ప్రత్యేకమైన చికిత్సా పద్ధతులు, మందుల ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. సాధారణంగా సర్జరీ అవసరం ఉండదు. ఉదయాన వాకింగ్ చేయడం, కొన్ని వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ వె రికోస్ వెయిన్స్ ఉంటే కనుక లేజర్ సర్జరీ లేక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ టెక్నిక్ సహాయంతో కంట్రోల్ చేయవచ్చు. వాపును తగ్గించవచ్చు. ఈ పద్ధతుల్లో చర్మంపై గాటుపెట్టడం, కుట్లు వేయడం ఉండదు. మరసటిరోజు ఆఫీసుకు వెళ్లిపోవచ్చు.
నిరంతరం వాపు ఉంటే....!
ఒకవేళ కాళ్లలో వాపు ఉండి, కొంచెం కూడా మార్పు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలానే ఉన్నట్లయితే రెండు అంశాలు కారణం కావచ్చు.
ఒకటి రక్తంలో ఆకి ్సజన్ లోపించడం వల్ల మలినాలు పేరుకుపోతాయి. గుండెకు రక్తం చేరుకోలేకపోతుంది. దీనివల్ల కాళ్లలో చెడు రక్తం పేరుకుపోతుంది.
ఈ పరిస్థితిలో ఉదయం వేళ కొంత వాపు తక్కువగా కనిపిస్తుంది. కానీ సాయంత్రం తిరిగి వాపు వచ్చేస్తుంది.
రెండవ కారణం రక్తనాళంలో బ్లాక్స్ ఏర్పడటం. బ్లాక్స్ మూలంగా రక్తసరఫరా సాఫీగా ఉండదు. ఈ కారణాల వల్ల కాళ్లలో వాపు పర్మనెంట్‌గా ఉంటుంది. ఈ పరిస్థితిని పోస్ట్ థ్రాంబోటిస్ సిండ్రోమ్ అని అంటారు.
ఒకవేళ కాళ్లలో సడన్‌గా వాపు కనిపించినా, క్లాట్స్ ఉన్నాయని సందేహపడినా వాస్క్యులర్ సర్జన్‌ను సంప్రదించడం ద్వారా పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ డెవలప్ కాకుండా కాపాడుకోవచ్చు.