రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగితే రోగాలు దరి
చేరవు, పడుకునే ముందు ఆహారం తింటే అది కొవ్వుగా శరీరంలో పేరుకుపోతుంది.
ఇలాంటి ఆరోగ్య సూత్రాలు తరచుగా వింటుంటాం. కొన్నిసార్లు పాటిస్తుంటాం కూడా.
కాని వీటిలో వాస్తవం ఎంత? మనం పాటించే
కొన్ని ఆరోగ్య సూత్రాలు నిరాధారమైనవి. వాటి వల్ల మనం అనుకుంటున్నంత
ఆరోగ్యపరమైన ప్రయోజనాలేవీ ఉండవని పరిశోధనల్లో తేలింది. మనం గుడ్డిగా నమ్మే
కొన్ని ఆరోగ్య సూత్రాల నిజానిజాలేంటో తెలుసుకుందాం....!
అపోహ: రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. 51ు మంది దీన్ని నిజమని నమ్ముతారు.
నిజం: శరీరానికి నీటి అవసరం అనేది ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే లెక్క వర్తించదు. క్రీడల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తికి రోజుకి 8 కంటే ఎక్కువ గ్లాసుల నీళ్లు అవసరం ఉంటుంది. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పళ్లు, కూరగాయలు ఎక్కువగా తినేవారికి అన్ని గ్లాసుల నీళ్లు అవసరం ఉండకపోవచ్చు.
అపోహ: నిద్రకు ముందు ఆహారం వల్ల కొవ్వు పేరుకుంటుంది. 66ు మంది ఇది నిజమని నమ్ముతారు.
నిజం: పిండి పదార్థాలు, కొవ్వులు ఉండే ఆహారం నిద్రకు ముందు తింటే శరీరంలో కొవ్వు పేరుకునే మాట నిజమే! అయితే తినే పదార్థాల వల్ల కొవ్వు పేరుకోవటం అనేది ఆరోజు మొత్తంలో మనం తిన్న ఆహారం, చేసిన శారీరక శ్రమల మీద ఆధారపడి ఉంటుంది.
అపోహ: పీచు పదార్థాలు తినటం వల్ల మలబద్ధకం దరి చేరదు. 45ు మంది ఇది అబద్ధమని నమ్ముతారు.
నిజం: మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు పీచు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆరోగ్యకరమైన పీచు వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది కూడా! అయితే ఇందుకోసం పొట్టు తీయని ధాన్యాలు తింటూ ఉంటాం. ఇలాంటి ధాన్యాల వల్ల మలబద్ధక సమస్య మరింత పెరుగుతుంది. ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ మలబద్ధకాన్ని పెంచటంతోపాటు కొన్ని రకాల ఖనిజ లవణాల శోషణ మందగించేలా చేస్తుంది. కాబట్టి పీచు కోసం ధాన్యాల కంటే ఎక్కువగా పీచు పుష్కలంగా ఉండే పళ్లు, కూరగాయలు తినటం మంచిది. మరి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల మలం మెత్తగా మారి మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
అపోహ: సన్ ట్యాన్ చర్మానికి మంచిది. 68ు మంది ఈ విషయం నిజమని నమ్ముతారు.
నిజం: సూర్యరశ్మి వల్ల చర్మం డ్యామేజ్ అయినందుకు సూచన సన్‌ట్యాన్. ఇది కచ్చితంగా చర్మానికి హానికారకమే! చర్మం ట్యాన్‌కు గురవ్వనంత మేరకు సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవటం ఆరోగ్యకరం. పదే పదే ఎండకు చర్మం కమలటం వల్ల చర్మపు క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే త్వరగా చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపించటం, ముడతలు, గీతలు ఏర్పడటం లాంటి సమస్యలూ మొదలవుతాయి.