మునగాకు ఎంతో మేలమ్మా!

మునక్కాయతో చేసిన ఏ వంటైనా చాలామంది ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి మంచివి కావడంతో ఎక్కువగా తింటుంటారు. అయితే మునగ కాయలతో పాటు ఆకులతోనూ కూరలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మాంసపుకృతులు దొరుకుతాయి. ఇవి ఆహారంగానే కాకుండా అనేక రుగ్మతలకు దివ్యౌషధంగా పనికొస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో మునగాకు శరీరానికి మేలు చేసేదిగా చెప్పవచ్చును. తోటల్లో మునగ చెట్లు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పెరట్లో కూడా ఈ మొక్కను పెంచుతారు. ఆకును కూరగా వండుకుంటారుగాని, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.
దీనిలో అధికంగా ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్నిస్తాయి.
మునగాకులో విటమిను - ఎ, విటమిన్‌ సి, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మాసంకృతులు కూడా ఉన్నాయి.
ఔషద గుణాలు ...
ముగన ఆకు రంసం, నిమ్మరంసం కలిపి ముఖానికి ప్రతి రోజూ ఉదయం రాసుకొంటే మయస్సులో వచ్చే మొటిమలు నివారించబడతాయి. అందం పెరుగుతుంది.
మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
మునగాకు కాడ నుంచి తీసిన రసాన్ని గాయాలకు రాస్తే యాంటి సెప్టిక్‌గా గాయాలను నయం చేస్తుంది.
మునగాకు నూరి ఆ ముద్దను కురుపులపై కడితే అవి నయం అవుతాయి. చిన్న దెబ్బలకు, బెణుకులకు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మునగాకు రసం, ఉప్పు కలిపిన రసం కొద్దిగా సేవిస్తూ ఉంటే అజీర్ణం తగ్గిపోతుంది.
ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి, రోజూ నిద్రపోయే సమయంలో తాగితే రేచీకటి తగ్గిపోతుంది.
ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనె కలిపి, దానిని ఒక గ్లాసు లేత కొబ్బరి నీరును కలిపి తీసుకుంటే కలరా, విరేచనాలు తగ్గుతాయి.
మునగాకును పాలలో కాసి కాగపెట్టి, ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది.
మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది.
మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం వేసి తాగితే ఆకలి పుడుతుంది.


 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review