ఈత కొట్టడానికి మనలో చాలామంది జంకుతుంటారు. కానీ ఈతకొట్టడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఈత శరీరానికి మంచి వ్యాయామం ఇస్తుందిట. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుందిట. ఈత కొట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. అవి
నీళ్లల్లోకి దిగే ముందు కండరాలు, జాయింట్స్ ఒకసారి సె్ట్రచ్ చేయాలి.
ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి.
నీళ్లల్లో ఎక్కువసేపు ఈత కొట్టలేకపోతుంటే వైద్యుని సలహా తీసుకోవాలి.
నిత్యం ఈత కొట్టడం వల్ల శరీరానికి ఫిట్‌నెస్ బాగా ఉంటుంది.
శారీరక, మానసిక ఆరోగ్యాలు కూడా బాగుంటాయి.
ఈతకొట్టడం వల్ల కండరాలు, జాయింట్ల బాధలు తగ్గుతాయి. కండరాలు బలిష్టంగా తయారవుతాయి.
గోరువెచ్చటి నీటిలో స్విమ్మింగ్ చేస్తే కీళ్ల సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా రుమాటాయిడ్ ఆర్థరైౖటిస్‌తో బాధపడేవారికి హైడ్రోథెరపీ మంచి ఉపశమనం ఇస్తుంది. ఈత కూడా ఏరోబిక్ వ్యాయామాల్లాంటిదే. దీనివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ బాధలు తగ్గుతాయి.
శరీరం మొత్తానికి ఈత వ్యాయామాన్ని ఇస్తుంది.
గుండె కండరాలకు కూడా మంచి వ్యాయామాన్ని ఇస్తుంది.
గుండె శక్తివంతంగా పనిచేసేట్టు సహాయపడుతుంది. గుండెకు రక్తప్రసరణ బాగా అవుతుంది.
శరీరంలోని కాలరీలు కరగడమే కాదు ఊబకాయం కూడా రాదు.
ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది.
గురక సమస్య, నోటితో గాలిపీల్చుకోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఊపిరితిత్తులు కూడా బాగా పనిచేస్తాయి.
శరీరంలో మంచి కొలెసా్ట్రల్ ఎక్కువ ఉండేలా, చెడు కొలెసా్ట్రల్ తగ్గిపోయేలా సహకరిస్తుంది. మంచి కొలెసా్ట్రల్ ఎక్కువ ఉండడం వల్ల గుండెజబ్బులు రావు.
శరీరాకృతి బాగుంటుంది.
డయాబెటిస్ పాలబడే అవకాశం ఉండదు.
యోగా లాగే ఈత కూడా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది.
ఈత కొట్టేటప్పుడు శ్వాస సంబంధమైన వ్యాయామం కూడా బాగా అవుతుంది.
ఈత కొట్టడం వల్ల బ్రెయిన్ కూడా ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు.
క్రమం తప్పకుండా రోజూ ఈతకొట్టడం వల్ల మనిషి జీవించే కాలం కూడా పెరుగుతుంది.




