స్వీట్‌కార్న్‌లో విటమిన్ బి, సీలతోపాటు మెగ్నీషియమ్, పోటాషియం
ఖనిజాలున్నాయి. పసుపుపచ్చరంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో ఎక్కువగా ఉన్న
యాంటీఆక్సిడెంట్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్లలో కంటే
స్వీట్‌కార్న్‌లో చక్కెర శాతం తక్కువగా
ఉంటుంది. అరటిపండ్లలో 15 గ్రాముల చక్కెర ఉండగా స్వీట్‌కార్న్‌లో 6 నుంచి 8
గ్రాములే ఉంటుంది. పైబర్ ఎక్కువగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలున్న
స్వీట్‌కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటారు పోషకాహార నిపుణులు.


