దేవుడి దీపారాధనకు నువ్వుల నూనె ఎంతో శ్రేష్ఠం.
కేవలం అందుకే కాదు.. అందం, ఆరోగ్యానికి కూడా! నువ్వు గింజల్లో నూనె
పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఉండడమే ఇందుకు కారణం.
నువ్వులు, నువ్వులనూనెతో పొందే ప్రయోజనాలేమిటో చూద్దాం....!
-నువ్వులు వేడి గుణాన్నీ, ఉష్ణశక్తినీ కలిగి ఉంటాయి. అందువల్ల చలికాలం, వర్షాకాలం వీటిని ఎక్కువగా ఉపయోగించాలి.
-గాయాలు తగిలినచోట నువ్వులనూనె రాస్తే ఉపశమనం కలుగుతుంది.
-పైల్స్, అతిసార, రుతుసంబంధ విషయాల్లో నువ్వులు బాగా పనిచేస్తాయి.
-నువ్వుల నూనె కొవ్వును కరిగిస్తుంది.
-అన్నం బాగా జీర్ణమవ్వడానికి నువ్వులు ఉపయోగపడతాయి.
-నువ్వులనూనెతో ప్రతిరోజూ శరీరానికి మర్దన చేయాలి. కాసేపాగి కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. అంతేకాదు.. చిన్నతనంలో వచ్చే వద్ధాప్య ఛాయలను కూడా అరికట్టవచ్చు.
-చిన్నపిల్లలకు నవ్వులనూనెతో మర్దన చేయడం వల్ల ఎముక్కలు బలంగా తయారవుతాయి.
-తలకు ఈ నూనెతో మాలిష్ చేయడం వల్ల చుండ్రు బాధ తగ్గుతుంది.
-నువ్వు పువ్వులను మెత్తగా చేసి అందులో నెయ్యి, తేనె కలిపి తలకు పట్టించాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
- నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి.
తెల్ల నువ్వుల్లో.. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.
నల్ల నువ్వుల్లో.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.

Posted in: