యూత్‌లో మందు హవా...!



టీనేజ్‌లో మద్యం మోజు పెరిగిపోతోంది. ఇది కొంత ఆందోళన కలిగించే విషయమని ఒక తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఈ మధ్య కాలంలో మద్యం అలవాటు మూడురెట్లు పెరగడం ఈ ఆందోళనకు కారణం. మరీ ముఖ్యంగా ఈ అలవాటు పట్టణ ప్రాంతాల్లోని పేద యువకుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మైల్మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకుడు అరవింద్‌ పిళ్లై ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు గోవా పరిసర ప్రాంతాల్లోని ఇరవై నుంచి నలభై ఏళ్లలోపున్న దాదాపు రెండువేల మంది యువకులను ప్రశ్నించి ఈ వివరాలను తెలిపారు. తొలిసారి ఏ వయసులో మద్యం రుచి చూశారు? ఆ తర్వాత దాన్ని కొనసాగించారా? రోజుకు ఎంత మేరకు తాగుతారు? మద్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయి? వంటి విషయాలు పరిశీలించారు పరిశోధకులు. యుక్త వయసులో మద్యం అలవాటు కావడం వల్ల.. ఆ తరువాత వదిలించుకుందామన్నా వదలబుద్ది కాక.. జీవితాంతం బాధ పడుతున్నట్లు తేలింది. దీనివల్ల వ్యక్తిగత జీవితంతోపాటు, కుటుంబ బంధాలు, ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు సర్వే చెప్పింది.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review