ఉత్తేజాన్నిచ్చే పిప్పర్‌మింట్‌..!



పిప్పర్‌మింట్‌ మొక్కలో అద్భుతమైన ఔషధగుణాలున్నాయి. పిప్పర్‌మింట్‌ ఆకులు వేసి తయారుచేసిన హెర్బల్‌ టీ తాగితే అమోఘమైన రుచి ఉంటుంది. పిప్పర్‌మింట్‌ ఆకులు ఘాటైన రుచితో పాటు ఒక ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి. ఈ మొక్కను ఇంటి పెరటిలోనూ, కుండీలలోనూ పెంచుకోవచ్చు.

ప్రయోజనాలు:

. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. బ్యాక్టీరియల్‌, మైక్రోబియల్‌ నివారిణిగా పనిచేస్తుంది.

. మౌత్‌ రిఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది. దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, తలనొప్పి, గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

. ఉదరకోశ సమస్యల నివారణిగా పనిచేస్తుంది.

. ఒళ్లు నొప్పులు, దురదలకు అద్భుతమైన మందు.

. నరాలు, కండరాల సమస్యలను దూరం చేస్తుంది.

. ఉదయం వేళ బద్దకాన్ని తరిమేస్తుంది.

. ఆరోమా, వేపర్‌థెరపీలో ఉపయోగించవచ్చు.

. గాల్‌బ్లాడర్‌ పనితీరు పెరగడానికి, బైల్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

. స్ర్తీలకు నెలసరి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

. ఆహారపానీయాలలో రుచికి, సువాసనకు ఉపయోగించవచ్చు.

. శారీరక, మానసిక స్తబ్ధతను దూరం చేసి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందించే అసమానమైన హెర్బల్‌ ఔషధం పిప్పర్‌మింట్‌.

- డా.ఎస్‌.వి.రామారావు
ప్లాంట్‌ సైంటిస్టు
ప్రగతి హెర్బల్‌ గార్డెన్‌

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review