శృంగారం యోగం...!

‘యోగా’ అనే పదం సంస్కృతం పదం ‘యుగ’ నుండి పుట్టింది. ‘యుగ’ అంటే కలయిక అని అర్థం. పతంజలి విరచితమైన యోగాశాస్త్రం ప్రకారం కలయిక అంటే శారీరక, మానసిక స్థితుల సమాగమం అని అర్థం. యోగాశాస్త్రం మనకు శారీరక, మానసిక, ఆరోగ్య స్థితులను పొందడం ఎలాగో వివరిస్తుంది. ఈ శాస్త్రంలో వివరించబడిన యోగాసనాలు, శారీరక వ్యాయామాలు మన శారీరక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసిక వ్యవస్థను కూడా సంరక్షిస్తుంది...

మీలో శక్తిని, ప్రాణాధారశక్తిని, పెంపొందింపజేయడానికి వీలుగా మీ కండరాల ఆరోగ్యం, బలం పెంచడానికిగాను ఈ వ్యాయామాలు రూపొందించబడ్డాయి. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు మీరు ఆచరించే పలురకాల శారీరక భంగిమలు, కండరాల విస్తరణ, మెలితిప్పడాలు వగైరా చర్యలన్నీ మీ అంతర్గత అవయవాలన్నిటినీ ఉత్తేజితం చేస్తాయి. దాంతోబాటు సక్రమమైన పద్ధతిలో మీరు శ్వాసించగలగడం తద్వారా స్వచ్ఛమైన తాజాయైన ఆక్సిజన్‌ మీ శరీరంలోని ప్రతి కణానికి, నాడులకు సరఫరా కావడం, అవన్నీ పునరుత్తేజితం కావడం జరుగుతుంది. మీ లైంగిక కేంద్రంగా పనిచేసే వెన్నెముక చివరిభాగం బలపడడం ద్వారా మీ లైంగిక పటుత్వం పెరుగుతుంది.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review