బొప్పాయితో బలమెంతో...!


బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్టిరీస్‌ గోడలపై కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.

శరీర బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది దివ్యౌషధం. పండు తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువ.
బొప్పాయిలో విటమిన్‌ సి ఎక్కువ ఉంది. ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది.

మధుమేహ వ్యాధితో బాధపడేవాళ్లు కూడా ఈ పండును నిస్సంకోచంగా తినొచ్చు. డయాబెటిస్‌ వచ్చే అవకాశమున్న వారు ఈ పండును తింటే డయాబెటిస్‌ బారిన పడరు.

ఈ పండులో విటమిన్‌ ఎ కూడా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. చూపు మందగించకుండా కాపాడుతుంది.
ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లకి కూడా బొప్పాయి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాంటి ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది.
బొప్పాయిలో పపైన్‌ అనే డైజిస్టివ్‌ ఎంజైమ్‌ ఉంది. ఇది జీర్ణక్రియ సరిగా జరిగేట్టు చేస్తుంది. ఇందులో ఉన్న పీచుపదార్థాల వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా అరుగుతుంది.

బహిష్టు సమయంలో నొప్పితో బాధపడే మహిళలకు బొప్పాయి పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది. బహిష్టు సమయంలో రక్తస్రావం సరిగా అయ్యేట్టు చేస్తుంది.
బొప్పాయిలో విటమిన్‌ సి, విటమిన్‌, బెటా కెరొటిన్‌ వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు మీలో కనిపించకుండా కాపాడతాయి.

బొప్పాయిలో ఫైటో న్యూట్రియంట్స్‌, ఫ్లవనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని కణాల డిఎన్‌ఎని పరిరక్షిస్తాయి. కాన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి.

స్నాక్స్‌లా బొప్పాయి ముక్కలను తింటే పని ఒత్తిడిని సైతం సులభంగా అధిగమించగలరు.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review