గుడ్డులోని పోషక విలువలు చాలా ఎక్కువ. గుడ్డులో
కొవ్వులు ఎక్కువని ప్రతిరోజు తినకూడదని చాలా మంది అపోహ పడుతారు కానీ
సంపూర్ణ ఆరోగ్య వంతులు రోజు గుడ్డు తిని తమ ఆరోగ్యాన్ని మరింత పదిల
పరచుకోవచ్చునని ప్రపంచంలో ఎక్కువ మంది
న్యూట్రిషనిస్టులు అభిప్రాయ పడుతున్నారు. గుండె సంబంధిత సమస్యలున్న వారు
లేదా రక్తంలో కొలేస్ట్రాల్ నిల్వలు పెరిగి పోయిన వారు గుడ్డులోని పచ్చ
సొనను మినహాయిస్తే మంచిది. అంతే కానీ పూర్తిగా గుడ్డు తినడం మాననవసరం లేదని
అధ్యయనాలు చెబుతున్నాయి.
గుడ్డులో ఎన్ని పోషకాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం.
-ప్రొటీన్లు- 6.3 గ్రాములు అంటే అత్యధికంగా ప్రొటీన్లుండే పదార్థం గుడ్డు
-కార్బోహైడ్రేట్స్ - 0.36 గ్రాములు
-కొవ్వు- 4.8 గ్రాములు
-కొలేస్ట్రాల్- 126 మిల్లీ గ్రాములు
-విటమిన్ ఏ- 270 యూనిట్లు
-విటమిన్ ఈ- 41 యూనిట్లు
-విటమిన్ బీ6- 0.09 యూనిట్లు
-విటమిన్ బీ12- 0.45 యూనిట్లు
-క్యాల్షియం- 28 మిల్లీ గ్రాములు
-సోడియం- 71 మిల్లీ గ్రాములు
-పొటాషియం- 69 మిల్లీ గ్రాములు
-ఐరన్- 0.88 మిల్లీ గ్రాములు
-జింక్- 0.65 మిల్లీ గ్రాములు
రోజూ ఒక గుడ్డు చొప్పున వారానికి ఆరు గుడ్లకు మించకుండా మీ ఆహారంలో భాగం చేసుకోండి. గుడ్డులోని పోషకాలతో పాటు రుచినీ ఆస్వాదించండి.
గుడ్డులో ఎన్ని పోషకాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం.
-ప్రొటీన్లు- 6.3 గ్రాములు అంటే అత్యధికంగా ప్రొటీన్లుండే పదార్థం గుడ్డు
-కార్బోహైడ్రేట్స్ - 0.36 గ్రాములు
-కొవ్వు- 4.8 గ్రాములు
-కొలేస్ట్రాల్- 126 మిల్లీ గ్రాములు
-విటమిన్ ఏ- 270 యూనిట్లు
-విటమిన్ ఈ- 41 యూనిట్లు
-విటమిన్ బీ6- 0.09 యూనిట్లు
-విటమిన్ బీ12- 0.45 యూనిట్లు
-క్యాల్షియం- 28 మిల్లీ గ్రాములు
-సోడియం- 71 మిల్లీ గ్రాములు
-పొటాషియం- 69 మిల్లీ గ్రాములు
-ఐరన్- 0.88 మిల్లీ గ్రాములు
-జింక్- 0.65 మిల్లీ గ్రాములు
రోజూ ఒక గుడ్డు చొప్పున వారానికి ఆరు గుడ్లకు మించకుండా మీ ఆహారంలో భాగం చేసుకోండి. గుడ్డులోని పోషకాలతో పాటు రుచినీ ఆస్వాదించండి.


