శృంగార సమస్యలకు పరిష్కారం ఉందా?



 సమస్య లోతుల్లోకి వెళ్లి చూస్తే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి.

వీళ్లకు ఏమైందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? శృంగారం అనగానే ఒకరకమైన సిగ్గు, మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడే వారి సంఖ్య మనచుట్టు చాలా మందే ఉన్నారు. అదేదో అంటరాని వ్యవహారం అన్నంతగా చూస్తామే తప్ప జీవన విధానంలో అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించడం లేదు. కానీ, చాటుమాటుగా శృంగారం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అరకొర పరిజ్ఞానంతో ఎన్నో చిక్కులు తెచ్చుకుంటునే ఉంటారు. అందువల్ల సెక్స్ ప్రస్తావన కూడా చెయ్యని వారి సంఖ్య చాలా ఎక్కువ. అయినా వారి శృంగార జీవితం నడచిపోతూనే ఉంటుంది. నీరసంగా, నిరుత్సాహంగా, నిస్తేజంగా నిశ్శబ్ధంగా సాగే ఈ సమస్యను యవ్వనంతో తొణికిసలాడేట్టు నిత్యనూతంగా సాగేందుకు ప్రయత్నించాలి.

మరి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లేదా? పాశ్చాత్య దేశాలలో శృంగార సమస్యలు వస్తే చాలా తొందరగా డాక్టర్‌నుసంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటారు. శృంగార సమస్యలకు ఆయుర్వేదంలో వాజీకరణ చికిత్సలు, ఔషధాలు సూచిస్తారు. వాజీకరణం అంటే గుర్రంలా శృంగారం చెయ్యగల సామర్థ్యం కలిగించే ఔషధాలు అని చెప్పవచ్చు. ఈ చికిత్సల వల్ల ఎంతో కాలంగా బాధపడుతున్న స్త్రీ పురుష శృంగార సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకుకతుంది. ఈ చికిత్సలు చేయాలంటే మొట్టమొదటగా మన శరీరంలో ఉన్న మలిన పదార్థాలను సహజ మార్గాల ద్వారా బయటకు పంపించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కారుకు సర్వీసింగ్ అవసరమైనట్టుగా శరీరానికి కూడా సర్వీసింగ్ అవసరమవుతుంది. నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకుంటే ప్రతిసమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review